మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్

 

 

 

 

డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్

పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన సమస్యగా మారిందని ఈ సమస్యను నిర్మూలిద్దామని కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ అన్నారు.ఈగల్ టీం ఫోర్స్, పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం పెనుబల్లి మండలంలో టేకులపల్లి మోడల్ స్కూల్, వి ఎం బంజర్ హై స్కూల్, సప్తపది ఫంక్షన్ హాల్ లొ విద్యార్థులకు మత్తుపదార్థాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, హాజరై డ్రగ్స్ వినియోగం పట్ల అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసిపి మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వినియోగం ప్రస్తుత సమాజానికి ప్రమాదకరంగా మారి ప్రధాన సమస్యగా తయారైందని అన్నారు. యువతచెడు స్నేహాలతో గంజాయి,మత్తు పదార్థాలకు బానిసలై ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని పాడు చేసుకుంటుందని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈగల్ టీం ఫోర్స్ ని 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విఎం బంజర రింగ్ సెంటర్లో మానవహారాన్ని ఏర్పాటుచేసి మత్తు పదార్థాల వాడటానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ టీం అధికారులు, సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం, వి.ఎం బంజర్ ఎస్ ఐ కె వెంకటేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.