ప్రాథమిక పాఠశాలలో నీటిని తొలగిస్తున్న పంచాయతీ

కార్యదర్శి శ్రీకాంత్

పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): మణుగూరు మండలం సాయినగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో సమిత్ సింగారం గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ నీటిని మళ్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా పాఠశాలలో వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతారత్నం చెప్పారు. చెప్పిన వెంటనే పాఠశాల ప్రాంగణంలో చేరిన నీటిని పరిశీలించారు. చాలా కాలం క్రితం కట్టిన పాఠశాల కావడం రహదారికి కిందికి ఉండటం వల్ల చిన్న వర్షం పడిన నీరు పాఠశాలలకు చేరుతోంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి పునారావృతం కావడంతో ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణంలో నుంచి నీటిని తొలగించిన తర్వాత మట్టిని నింపి నీటి నిలవ లేకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు.