ప్రైవేటు బస్సు బోల్తా : 12 మందికి గాయాలు

యర్రగొండపాలెం : హైదరాబాద్‌ నుంచి కనిగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని బోయినపల్లి మూల మలుపు వద్ద గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ నాయక్‌ పరిశీలించారు.