ప్రైవేట్ పాఠశాలల బస్సుల నాణ్యతపై తనిఖీలు ఏవి…?

గద్వాల రూరల్ జులై 14 (జనంసాక్షి):-  ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసే మోటార్ వాహనాల అధికారులు, పోలీసులు ముందస్తుగా పాఠశాలల వాహనాలపై కండిషన్ లపై తనిఖీ చేయడం ఎక్కడా కనబడడం లేదు. ప్రైవేట్ పాఠశాలల వాహనాల కిటికీలకు జాలి ఏర్పాటు, ప్రతి వాహనం వెంబడి క్లీనర్ ఉన్నాడా, డ్రైవర్ అనుభవం ఉన్నవాడే నా, అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా, లైసెన్స్ ఉన్న డ్రైవర్ ఏనా అని వాహనం కండిషన్ ఎలా ఉందో పరిశీలించే అధికారి ఒక్క రోజు కూడా రోడ్లపై వాహనాలు తనిఖీ చేసిన పాపాన పోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పాఠశాలలు పునః ప్రారంభం నుండి ప్రతి పాఠశాలల వాహనాలను అధికారులు తనిఖీ చేసిన తర్వాత విద్యార్థుల ఎక్కించుకోవడానికి వెళ్ళేవి. ఇప్పుడు పాఠశాల యజమానుల నజరానాల తో సంబంధిత అధికారులు తనిఖీలు, వాహనం కండిషన్ చెక్ చేయకుండానే అనుమతులు ఇస్తున్నారు. దీనికి సమన్వయకర్తల జోక్యంతో పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ఎవరినో బలి చేయడంలో అధికారులు నేర్పరులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాహనాలను తనిఖీ చేసి ముందస్తుగా ప్రమాదాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు రవాణా శాఖ అధికారులను కోరుతున్నారు….
Attachments area