ఫారెస్ట్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

– ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
ఆళ్లపల్లి జులై   (జనం సాక్షి)
టేకులపల్లి ఫారెస్ట్ రేంజ్ రేంజర్ మొక్తియార్ హుస్సేన్, మొర్లిపాడు సెక్షన్ ఆఫీసర్ దేవ్ సింగ్, జంగాలపల్లి, మొర్లిపాడు బీట్ ఆఫీసర్ లు ఎం.మోహన్, జోగ భద్రయ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయిపాడు గ్రామంలో సర్పంచ్ వూకె ఈశ్వరి అధ్యక్షతన అఖిల పక్షం ఆధ్వర్యంలో పోడు భూముల సాధనకై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండలంలో పోడు భూముల సాధనకై గిరిజన గ్రామాల్లోని ప్రజలందరు ఏకమై చట్ట ప్రకారం తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి మండలంలోని అన్ని పార్టీలు పోడు సాగుదాలకు మద్దతివ్వాలని కోరారు. గిరిజన భూములలోకి వెళ్లాలంటే పీసా చట్టం ఉంటుందని, ఫారెస్ట్ అధికారులు దానిని నిర్వీర్యం చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులు పీసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ రోజు అవగాహన కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు పీసా చట్టంపై అవగాహన లేదన్నారు. 25 ఎకరాల పోడు భూములను లక్ష్యంగా చేసుకుని వచ్చిన అధికారులు ఏ విధంగా వచ్చారని ప్రశ్నించారు. ఒక హోదాలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధిని, మహిళలను పోలీస్ చట్టాలకు విరుద్ధంగా బలవంతంగా ఫారెస్ట్ జీవులలో ఎక్కించి అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అఖిల పక్షం పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు సోమవారం బలవంతంగా ఫారెస్ట్ జీవులలో ఎక్కించి, అక్రమ కేసుల్లో ఇరికించాలని చూసినా అదరని బెదరని మహిళా సర్పంచ్, మహిళల ధైర్య సాహసాలను అభినందించారు. గత వేసవిలో అన్ని గ్రామాల గిరిజనులు ఏకమై ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై పోరాడినట్లే ఇప్పుడు అదే చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మంగళవారం టేకులపల్లి రేంజ్ ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై ఇల్లందు డీఎస్పీ రమణమూర్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు మాజీ ఎంపీపీ పెండకట్ల పాపారావు, స్థానిక వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, కాంగ్రెస్ మండల నాయకుడు గౌరబోయిన సుబ్బారావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు భానోత్ ఊక్ల, టీఆర్ఎస్ మండల నాయకుడు  కిశోర్ బాబు, పూనెం కృష్ణ,  వూకె నాగేశ్వరరావు, వూకె చిన్న పాపయ్య, వూకె ఎర్రయ్య, విశ్వనాథ్, సులోచన, వెంకటమ్మ, చంద్రకళ, లక్ష్మి, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area