ఫాసిస్టు హత్యాకాండలతో ప్రజా పోరాటాలను, విప్లవోద్యమాలను అడ్డుకోలేరు!


అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాదం హత్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ శుక్రవారం పత్రికా కార్యాలయాలకు ఒక ప్రకటన పంపారు. ఆ ప్రకటన యథాతథంగా…
జూలై 4న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సోనియా- మన్మోహన్‌- చిదంబరం- షిండే-జయరాం రమేష్‌ల దేశ పాలకముఠా మార్గదర్శ కత్వంలో ప్రజా ఉద్యమ నేత కామ్రేడ్‌ గంటి ప్రసాదంను కుట్రపూరి తంగా, పచ్చి ఫాసిస్టు తరహాలో హత్య చేయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇలాంటి హత్యలు కొత్తేమి కానప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమానికి నిర్మూలించామని గత కొన్నేళ్లుగా విర్రవీగుతున్న దోపిడీ పాలకులు ఈ హత్య ద్వారా తమ కలవరపాటును, పిరికిత నాన్ని చాటుకున్నారు. కామ్రేడ్‌ గంటి ప్రసాదం శ్రీకాకుళ ఉద్యమ ప్రేరణతో విప్లవోద్యమంలో చేరిన సీనియర్‌ నేత. అప్పటి నుంచి ఎత్తిన జెండా దించకుండా విప్లవోద్యమ బాటలో, ప్రజా ఉద్యమాల నిర్వహణలో ముందుకు సాగుతూ వచ్చిన కాకలుదీరిన కమ్యూనిస్టు ఆయన. విప్లవ కవిగా, రచయితగా కూడా పేరున్న కామ్రేడ్‌ ప్రసాదం గతంలో పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రకమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆ క్రమంలో పోలీసులు ఆయనను, మరి కొంత మంది విప్లవ రచయితలను అరెస్టు చేసి తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారు. విడుదలైన తర్వాత ఆయన తన వయస్సును, అనారోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని అజ్ఞాత జీవితానికి బదులు బహిరంగ ప్రజా ఉద్యమ జీవితంలో కొనసాగాలని నిర్ణయించకు న్నాడు. అప్పటి నుంచి ఆయన అమరవీరుల బంధుమిత్రుల కమిట ీలో కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న చట్టబద్ధ, బహిరంగ ప్రజాస్వామిక ఉద్యమాలన్నిటిలో భాగమయ్యాడు. విప్లవ సాహిత్యోద్య మానికి కూడా ఆయన వెన్నుదన్నుగా నిలబడ్డాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ప్రజా ఉద్యమంతో ఆయన మమేకమయ్యారు. దేశ పాలకవర్గాలు సహజ సంపదలన్నిటీని బహు ళజాతి కంపెనీలకు, దళారీ బూర్జువాల కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ, ఆదివాసులను, తదితరు పీడిత ప్రజలను పెద్ద ఎత్తున నిర్వాసితుల్ని చేయడానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డాడు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో, సెజ్‌లో పేరుతో, అభయార ణ్యాల పేరుతో, ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో, ఓపెన్‌కాస్ట్‌ గనుల పేరుతో ప్రభుత్వాలు నేడు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజానికం ఎక్కడికక్కడే విరోచిత పోరాటాలు చేస్తున్నారు. కామ్రేడ్‌ గంటి ప్రసాదం ఆ పోరాటాలన్నిటికీ మద్దతుగా నిలబడ్డాడు. వాటిలో పాలు పంచుకున్నారు. ఎన్నిటికో ప్రత్యక్షంగా మార్గదర్శకత్వం వహించాడు. అందుకే ఆయన దోపిడీ పాలకులకు కన్నెర్రగా మారాడు.ప్రత్యేక గత నాలుగేళ్లుగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో ప్రజలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. దేశ అంతరంగిక భద్రతకు మావోయిస్టు ఉద్యమం అతి పెద్ద ముప్పుగా పరిణమించిం దన్న సాకుతో అది ఈ న్యాయమైన, ఫాసిస్టు దాడికి పూనుకున్నది. నిజానికి పాలకవర్గాలు అనుసరిస్తున్న నయా ఉదార విధానాలకు, అందులో భాగంగా సాగిస్తున్న ప్రకృతి సంపదలు నిలువు దోపిడీకి మావోయిస్టు ఉద్యమం అడ్డుగా నిలబడినందువల్లనే వాతటికి అది కంట్లో నలుసైంది. ఈ అన్యాయమైన యుద్ధంలో భాగంగా మావో యిస్టు నాయకత్వాన్ని, కార్యకర్తలను, ప్రజా ఉద్యమ నేతలను, ప్రజా స్వామికవాదులను టార్గెట్‌ చేస్తున్నారు. ఇది కేవలం మావోయిస్టు ఉద్యమం పైనే జరుగుతున్న దాడి కాదు, న్యాయం కోసం ప్రజాస్వా మ్యం కోసం, విమూక్తి కోసం పోరాడుతున్న శక్తులన్నిటి పైనా జరుగుతున్న ఘోరమైన దాడి ఇది. కామ్రేడ్‌ గంటి ప్రసాదం హత్య ఇందులో భాగమే. గత 25న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో మా పార్టీ నాయకత్వంలో పీఎల్‌ జీఏ నిర్వహించిన దాడిలో బస్తర్‌ పీడిత ప్రజల పరమ శత్రువు, నరహంతకుడు మహేంద కర్మతో పాటు వీసీ శుక్లా, నంద్‌కుమార్‌ పటేల్‌ వంటి అభివృద్ధి నిరోధక నేతలు, మరి కొందరు మట్టిగరి చారు. ఈ దాడి సాకుతో విప్లవ, ప్రజాస్వామి క ఉద్యమాలన్నిటిపై ఉక్కుపాదం మోపాలని తమ దాడిని మరింత తీవ్ర స్థాయిలో కొనసాగించాలని దేశ పాలకులు కుట్ర పన్నారు. కామ్రేడ్‌ గంటి ప్రసాదం దారుణ హత్యను ఈ కుట్రలో భాగంగా కూడ చూడాల్సి వుంటుంది. ఈ హత్య ద్వారా దోప ిడీ పాలకులు తమ ప్రజా వ్యతిరేక, ఫాసిస్టు స్వభావాన్ని మరో సారి చాటుకున్నారు. గతంలో డాక్ట ర్‌ రామనాథం జాపా లక్ష్మారెడ్డి, పురుషోత్తం, నర్రా ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్‌ అందె నారాయణ, బెల్లి లలిత, కనకాచారి వంటి ప్రజా ఉద్యమ నేతలను హతమార్చినట్టుగానే కిరాయి హంతకులతో, తెల్లబట్టల పోలీసులతో కామ్రేడ్‌ గంటి ప్రసాదాన్ని హత్య చేయించి మాకేమీ తెలియదని బుకాయిస్తున్నారు. ఈ హత్య రాజ్యం తన ప్రజావ్యతిరేక, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా గొంతెతున్న, ఉద్యమిస్తున్న, పోరాడుతున్న వాళ్లందరినీ హెచ్చరిస్తున్న ది. ఇలాంటి హత్యల ద్వారా ప్రజల న్యాయమైన ఉద్యమాలను అణచి వెయ్యగలనని కలలు గంటున్నది. కాని అణిచివేత ప్రతిఘటనకే దారి తీస్తుందనేది చరిత్రలో తేలిపోయిన సత్యం. హత్యలతో ఉద్యమాలను అడ్డుకోలేరు. వ్యక్తులను హత్య చేయగలరు. కాని వాళ్ల భావాలను హత్యం చేయడం ఆసాధ్యం. కామ్రేడ్‌ గంటి ప్రసాదం అమరత్వం సాక్షిగా ఆంధ్రద్రేశ్‌లోనూ, దేశమంతటా ప్రజాస్వామిక, విప్లవ పోరా టాలు పురోగమిస్తాయే తప్ప వెనుకడుగు వెయ్యవు. భారత కమ్యూని స్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కామ్రేడ్‌ గంటి ప్రసాదం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో శక్తివం చన లేకుండా కృషి చేసిన కమ్రేడ్‌ గంటి ప్రసాదానికి ఘనంగా విప్లవ జోహార్లు చెబుతున్నది. ఆయన మృతితో శోకంలో మునిగిపోయిన ఆయన సహచరికి, కుటంబ సభ్యులకు, ఆయన ఉద్యమ సహచరుల కు, సంస్థలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆయన హత్యకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడే కార్యక్రమాలు, ప్రజాందోళనలు చేపట్టాల్సిందిగా దేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నది.