ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక 60 ఫీట్ రోడ్ నుండి కొత్త బస్టాండ్ వరకు పెండింగ్ లో ఉన్న 3375 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో భారి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలకు న్యాయంగా అందించాల్సిన రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్స్ గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. రూ.3375 కోట్ల ఫిజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు అందించాల్సిన కోట్లాది రూపాయలు ఇవ్వకపోవడం వల్ల వారి చదువులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యారంగానికి బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ స్కూల్లో కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేక సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగానికి 10 నుండి 12శాతం నిధులు బడ్జెట్ లో కేటాయిస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5 నుండి 6 శాతం నిధులు కేటాయించడం దారుణమన్నారు.వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వానికి విద్యా రంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్పొరేట్ విద్యాసంస్థలు నిషేధించాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో సంఘ డివిజన్ అధ్యక్షులు నారగని లింగస్వామి, జలగం సుమంత్, బట్టిపల్లి మహేష్, నల్గొండ అజయ్ , తాళ్లపల్లి సాయి ప్రత్యూష , నందిని, కల్యాణి, అఖిల, లిఖిత,నవ్య, మనసా, సుష్మిత, రిజ్వాన, తేజ తదితరులు పాల్గొన్నారు.