ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

` కాలిబూడిదైన ఆధారాలు
` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు
` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు
` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి ఆహుతి
సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసారు. అయితే అత్యంత రద్దీగా ఉండే ఈ ఆప్రాంతంలో పక్కనే నీలోఫర్ ఆస్పత్రి కూడా ఉంది. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాంచారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, ఎవరినీ ల్యాబ్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.ªSగా.. ఉదయం 10:00 గంటల ప్రాంతంలో మొదటి ఫ్లోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్లోర్‌లోని కంప్యూటర్లు, ఫోరెన్సిక్ సంబంధిత కెమికల్స్‌తో సహా కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో పలు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మంటల్లో ఫోన్ ట్యాపింగ్‌కు కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులూ కాలిపోయినట్లు సమాచారం.నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్టానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరిరజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సవిÖక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసు సహా పలు కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్‌లు ఇక్కడే ఉండటంతో ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అంటున్నారు.
ఫోరెన్సిక్ కార్యాలయ దగ్ధంతో రుజువలన్నీ దగ్ధం
హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను భద్రపరిచే చోట మంటలు చెలరేగడంతో, పలు కేసుల్లో సేకరించిన భౌతిక ఆధారాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంపై డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం విÖడియాతో మాట్లాడుతూ విస్తుపోయే వివరాలను వెల్లడించారు. మంటలు వ్యాపించిన తీరు, జరిగిన ఆస్తి నష్టం, కేసులపై పడే ప్రభావం గురించి ఆయన వివరించారు. ఈ అగ్నిప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, సాక్ష్యాధారాలను భద్రపరిచిన గది మొత్తం పూర్తిగా కాలిపోయిందని శ్రీదాస్ తెలిపారు. విచారణలో ఉన్న పలు కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం ఈ ప్రమాదంలో ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్ సాక్ష్యాల నిధిగా భావించే సుమారు 40 నుండి 50 కంప్యూటర్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. గదిలో అత్యంత భద్రంగా స్టోర్ చేసి ఉంచిన హార్డ్ డిస్క్‌లు కూడా మంటల ధాటికి పూర్తిగా కాలిపోయాయని, దీనివల్ల కీలకమైన డిజిటల్ డేటా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఎలక్టానిక్ వస్తువులే కాకుండా, ఆ గదిలో ఉన్న వివిధ రకాల ఎª`లాస్టిక్ వస్తువులు కూడా మంటలకు తోడవడంతో నష్టం తీవ్రత ఊహించని స్థాయిలో జరిగింది. ఈ దుర్ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. తొలుత మంటలు వ్యాపించిన సమయంలో అక్కడే ఉన్న ఎఫఎసఎల్ సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలతో వాటిని ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, లోపల ఉన్న ఎలక్టానిక్ విడిభాగాలు , ఎª`లాస్టిక్ సామగ్రి కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగి, గది మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సాధ్యం కాలేదని, చూస్తుండగానే సాక్ష్యాధారాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయని ఆయన వివరించారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లడం కూడా అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది.

ఓటుకు నోటు ఆధారాలు తగులబెట్టారు
` ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం ప్రమాదంపై అనుమానాలున్నాయి : కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్ప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాగా, బీఆరఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్టానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ్గªరిరజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సవిÖక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.