ఫ్యూచర్ అంతా ఫూచర్ సిటీదే

` ఆదర్శ నగరాలతో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దాలి
` ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక
` ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివద్ధిలో భాగస్వాములు కావాలి
` జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభించేలా చర్యలు
` 60 ఎకరాల్లో స్కిల్ యÖనివర్సిటీ నిర్మాణం
` ఓఆరఆర్ పెద్ద అసెట్ కానుంది
` అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్
` మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ
` గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి
` ప్రజాప్రతినధులు సిటీ కోసం కషి చేయాలి
` మÖడు బుల్లెట్ టైన్స్ కేంద్రంగా శంషాబాద్
` ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సిఎం రేవంత్ శంకుస్థాపన
(శంషాబాద్ కేంద్రంగా అమరావతి,బెంగళూరు,ముంబైలను అనుసంధానిస్తూ బులెట్ రైళ్లు పరుగులు పెట్టబోతోంది)
హైదరాబాద్(జనంసాక్షి):ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరి కషితోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సిటీ నిర్మాణం అంత సులభం కాదన్నారు. అయితే పక్కా ప్రణాళికతో ప్రపంచ నగరాలకు దీటుగా నిర్మించబోతున్నామని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే నగరంలో తమనూ కలపాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల్ని అభివద్ధిలో భాగస్వాములు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్ప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా విÖర్ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ అడ్మినిస్టేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయాలను ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికీ సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది నేతలు హైదరాబాద్ అభివద్ధిని కొనసాగించారని చెప్పారు. ఇప్ప్పుడు నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యాధునిక నగరాల తరహాలో, భారత్‌లోనే నాలుగో నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 60 ఎకరాల్లో స్కిల్ యÖనివర్సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. మనకున్న అద్భుతమైన ఆరఆరఆర్, ఐటీ ఎగుమతులు, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన ఘనతలే ఈ నగరానికి స్ఫూర్తి అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ నగర నిర్మాణానికి సహకరించే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. వచ్చే జూన్ నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. సిటీ నిర్మాణానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. ప్రపంచంతో పోటీపడేలా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ లోపు ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. గతంలో హైటెక్ సిటీ అంటే అవహేళన చేశారని.. ఏ నగరానికీ లేని ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు ఉందన్నారు. మÖడు కొవిడ్ వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు. యుద్ధ విమాన సర్వీస్ సెంటర్లూ హైదరాబాద్‌లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడేటా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఒక నగరం కాదు, ఇది రాబోయే తరాల తలరాతను మార్చే అద్భుతమన్నారు. ఈ నగర నిర్మాణం అంత సులభం కాదు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫ్యూచర్ సిటీలో కలవాలనుకునే గ్రామాలు… గ్రామ సభల్లో తీర్మానం చేసి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు ఫ్యూచర్‌సిటీ అభివద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందన్నారు. ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల సర్పంచ్‌ల వివరాలు తెప్పించుకోవాలి. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి.. కలెక్టర్, మంత్రికి పంపాలి. ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతాం. ఆదర్శ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం అని సీఎం అన్నారు. ఇకపోతే కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు బులెట్ టైన్లను ప్రకటిస్తే.. అందులో మÖడు మన రాష్టానికే రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, అమరావతి నగరాలను అనుసంధానిస్తూ బులెట్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయని చెప్పారు. కేవలం రైళ్లే కాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ బస్సు టెర్మినల్‌ను కూడా మనం నిర్మించుకోబోతున్నామని రేవంత్ తెలిపారు.
మెట్రో, బులెట్ టైన్, అత్యాధునిక బస్ టెర్మినల్.. ఇవన్నీ ఒకే చోట ఏర్పాటు కాబోతున్నాయన్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లా ఒక మహా అద్భుతానికి సాక్ష్యం కాబోతోందని చెప్పారు. తాను కూడా ఈ గడ్డ నుండే ఊరికి వెళ్తాను.. అందుకే విÖపై ఉన్న అభిమానంతో, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం అద్భుతమైన ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడని కొందరు అంటున్నారు… నా విÖద ఏడ్చే వారికి నేను చెప్పేది ఒక్కటే.. విÖరు ఏడ్చుకుంటూనే ఉండండి, నేను నా పని చేసుకుంటూనే పోతా.. విÖ ఏడుపే నా చెవులకు వినిపించే మధుర సంగీతం అని రేవంత్ అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, డిజిపి శిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు