ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికీ డిప్యుటేషన్

మహబూబాబాద్ ప్రతినిధి, జులై 9 (జనం సాక్షి):
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి రితీశ్ మిగలడంతో హెడ్మాస్టర్ శ్రీనివాస్ తో కలిసి అతడిని కల్వల ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్ పై తరలించారు. దీంతో క్యాంపు తండా పాఠశాలకు తాళం పడింది. విద్యా హక్కు చట్టాన్ని విస్మరించి పాఠశాలను మూసివేశారంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు