ఫ్రీడం ర్యాలీని ప్రారంభించిన జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి

… స్టేషన్ ఘనపూర్ ఏసీపి డి రఘు చందర్
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 13 , ( జనం సాక్షి) : చిల్పూర్ మండలం లోని మల్కాపూర్ గ్రామంలో
భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీ  గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలనుండి గ్రామ పంచాయతీ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్  పాగాల సంపత్ రెడ్డి ఫ్రీడం ర్యాలీని ప్రారంభించా రు. అనంతరం భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుక ల గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో చిల్పూ ర్ మండల ఎస్సై ఎం రాజు,ఎంపీడీవో, ఎమ్మార్వో,  ఎంపీవో, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణా రెడ్డి, టీఆర్ఎస్ మండల కో ఆర్డినేటర్ పోలేపల్లి రంజిత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానో పధ్యాయులు, ఉపా ధ్యాయ బృందం,యూత్ అధ్యక్షుడు వేముల రవి యాదవ్, గ్రామ యువకు లు దోరం శ్రీను, సన్నీ , కుమార్ ,అశోక్, రాహుల్, వెన్నం రంజిత్ రెడ్డి,అజయ్,హరీష్, అశోక్, రఘు పతి,గ్రామమహిళా సంఘాలు, విద్యార్థులు, అంగ న్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు,గ్రామస్థులు తది తరులు పాల్గొన్నారు.