ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో గ్రీన్ డై సెలబ్రేషన్స్

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి)

మహబూబాబాద్ స్థానిక కృష్ణకాలనిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఫ్రీప్రైమరీ విద్యార్థిని విద్యార్థులతో గ్రీన్ కలర్డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ దాసరి మధు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రకృతిని గౌరవిస్తూ విద్యార్థులకు గ్రీన్ కలర్ లో వేషధారణలతో విద్యార్థులను బడికి పంపడం సంతోషమని తెలిపారు. విద్యార్థులకు గ్రీన్ బెలూన్లతో పండుగ వాతావరణాన్ని గ్రీన్ డే ను ఘనంగా సన్మానించారు. ప్రతీ కలర్ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు పరిచయం చేయడం ద్వారా వారిలో కలర్ భావనను పటిష్టంగా వారి లేత మనస్సులో చిరకాలం గుర్తుండేలా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ విద్య,చేతన్, జయప్రకాష్, భార్గవి, బిందు, సుధాకర్, ప్రైమరీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు