బంగారు తెలంగాణకు దిశానిర్దేశం

5
ప్లినరీలో కీలక నిర్ణయాలు

మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వద్దు

ఎంపీ కవిత

హైదరాబాద్‌,ఏప్రిల్‌26 (జనంసాక్షి) :

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ లక్ష్యమని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకోసం ప్లీనరీలో విశ్లేషించుకుని ముందుకు సాగడం ఆనవాయితీ అని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్లీనరీపై కొందరు చేస్తున్న విమర్శనలు ఆమె తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నామన్నామని, మేనిఫెస్టోలోలేని అంశాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలంతా తమకు అండగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టి వల్లే టీఆర్‌ఎస్‌ తన లక్ష్యం వైపు నడుస్తోందని పేర్కొన్నారు. ఏటా ఎక్కడో ఒకచోట ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీ అని,ఈ యేడు  ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం ప్రతినిధుల సమావేశం, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ప్రతినిధుల సభకు 4 వేల మందిని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. ప్లీనరీకి పాలేరు ఉప ఎన్నికకు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. ప్లీనరీకి ఇది వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసే లక్ష్యంతో

మిషన్‌ భగీరథను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కరవు పరిస్తితుల్లో ప్లీనరీ అవసరామా అని కొందరు చేస్తున్న విమర్శల్లో అర్తం లేదన్నారు. కరవు ఉంటే ముడచుకుని కూర్చుంటే కాలం గడవదన్నారు. పాలేరు ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్‌, టిడిపిలు చేస్తున్న విమర్శలను ఆమె తప్పు పట్టారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలుపోటములతో సంబందం లేకుండా పోటీ చేస్తున్నాని అన్నారు. జహీరాబాద్‌లో ఏ సూత్రం ఆధారంగా టిడిపి పోటీ చేసిందన్నారు. అలాగే అక్కడ డిపాజిట్‌ రాకపోవడంతో పాలేరునుంచి పారిపోయిందన్నారు. పార్టీ పాలసీలో భాగంగా తాము ముందుకు పోతున్నామన్నారు. పాలసీని పక్కనబెట్టి టీడీపీ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపితే ఆపార్టీ చేసిన తప్పులకు బాధ్యులవుతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలేరు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమను సంప్రదించడం సరికాదని వ్యాఖ్యానించారు.పాలేరు ఉప ఎన్నిక విషయంలో విపక్షాల ఆరోపణలను ఆమె తప్పుపట్టారు. నారాయణ ఖేడ్‌ ఉపఎన్నికల్లో ప్రజలు విపక్షాల డిపాజిట్లను గల్లంతు చేస్తే.. ఆ షాక్‌కు పాలేరు ఎన్నికల బరినుంచి విపక్షాలు పారిపోతున్నాయని కవిత ఎద్దేవా చేశారు. విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్‌, టీడీపీలకు లేదన్నారు. కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి   తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిపై పోటీ చేసిన విషయాన్ని అమె గుర్తు చేశారు. దీంతో ఆయన ఎక్కడ నియమాలు పాటించారని అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్‌ఎస్‌కు హరీశ్‌ రావు, కేటీఆర్‌ ఇద్దరూ సమానమేనని నిజామాబాద్‌ ఎంపీ కవిత స్పష్టం చేశారు.  కేబినేట్‌ మార్పులు చేర్పులపై ఊహాగానాలు సరికాదన్నారు.  మంత్రుల శాఖల మార్పులను చిలువలుపలువలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణెళి తమ అందరి లక్ష్యమని చెప్పారు. ఎవరికి ఏ శాఖ కేటాయించినా దానాని వారి బాధ్యత మేరకు పనిచేయాలన్నదే కెసిఆర్‌ లక్ష్యమన్నారు.  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాకతీయ కాలువ అభివృద్ధి పనులు ప్రారంభిస్తే అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అబద్దాల జ్యోతి అని దుయ్యబట్టారు. అర్థ సత్యాలు చెప్పే పత్రికలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే టీజీబీజీకేఎస్‌కు కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.