బంగారు తెలంగాణ అంటే ఇదేనా?

కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు గజానంద్ పటేల్
జుక్కల్,అక్టోబర్11,(జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని ఆర్టిసి బస్టాండ్లు అధ్వాన్నంగా మారాయని బంగారు తెలంగాణా అంటే ఇదేనా అని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ పటేల్ ప్రభుత్వానికి ప్రశ్నించారు. ఆయన మంగళవారం జనంసాక్షి తో చరవాణి లో మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు శీర్షికతో
మంగళవారం జనంసాక్షి లో ప్రచురిత మయిన
వార్తను చదివానని తెలిపారు. నియోజక వర్గంలోని బస్టాండ్లు శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వం పట్టించకోవడం లేదని విమర్శించారు. బస్టాండ్లలో మరుగు దొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఉన్న బిజేపి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టిసిటికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతుందని ప్రయాణికుల సమస్యలు మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేకపాలన సాగిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని, అప్పుడు ప్రజలసమస్యలన్నిటిని తీరుస్తామని ఆయన తెలిపారు.