బచ్చలకూర రాములు మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బచ్చలకూర (చిన్న)రాములు(84) మరణము సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలోని రాములు నివాసంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం నాగర్జునరెడ్డి మాట్లాడుతూ, రాములు చిన్నతనం నుండి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై భూమి భుక్తి కూలి పోరాటాలలో పాల్గొని వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచాలని కూలి పోరాటాలు, పాలేర్ల సంఘాలు పెట్టి పోరాటాలకు నాయకత్వం వహించినాడన్నారు. నేలమర్రి గ్రామము నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజానాట్యమండలి కళాకారుల దళముగా ఏర్పడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజానాట్యమండలి కళాకారుడుగా”భూస్వామి ” వీధి బాగోతాన్ని యక్షగాన రూపంలో అనేక జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రదర్శించి ప్రజలను చైతన్యపరిచి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బచ్చలకూర (చిన్న) రాములు పార్థివదేహాన్ని మెడ్ సిటీ మెడికల్ కాలేజ్ మేడ్చల్ కు ఇవ్వనైనదని, నేత్రాలను వాసన్ ఐకేర్ హాస్పిటల్ దానం చేయటం జరిగినదని తెలిపారు. రాములుకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. గురువారం రాత్రి జరిగిన బచ్చలకూర రాములు(చిన్న ) అంతిమయాత్రలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, జె నరసింహారావు, రైతు సంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత, జె విజయలక్ష్మి, ఎస్కే సైదా, ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం రాంబాబు, యలక సోమన్న గౌడ్, ఎం గోపయ్య, పిఎన్ఎం జిల్లా నాయకులు బి రాంబాబు, కాంపటి శ్రీను, గ్రామశాఖ కార్యదర్శి బి ఉపేందర్, కే కోటయ్య, బి సుధాకర్, బి సుందరయ్య, బి రాందాసు, ఎన్ కవిత తదితరులు పాల్గొన్నారు.