బతుకమ్మ సంబురాలు జరుపుకున్న డిగ్రీ కళాశాల బృందం
మహాదేవపూర్. సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
మహాదేవపూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు టి. రజిత ఆధ్వర్యంలో మహిళా సిబ్బంది అస్ర , భాగ్యలక్ష్మి ,కరీం బీ, విద్యార్థినులతో కలిసి కళాశాలలో బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి, ఊరేగింపుగా తీసుకొని వచ్చి కళాశాల ఆవరణలోప్రతిష్టించి ఆట పాటలతో అలరించారు. అధ్యాపకురాలు రజిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు కాపాడుకోవలసిన అవసరం ఉందని, విద్యార్థినులను ప్రోత్సహించి బతుకమ్మ పాటలతో గౌరమ్మను పూజించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసినా కళాశాల టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బందిని కొనియాడారు.ఈకార్యక్రమంలో విజయ్ కుమార్, రమేష్, డాక్టర్ రాజు, డాక్టర్ శ్రీనివాస్, వీ రమేష్, రాజేందర్, పరశురాములు, మున్నయ్య, రవీందర్, డాక్టర్ రాజన్న, వేణు,వెంకటయ్య , రవీందర్,విద్యార్థినీలు పాల్గొన్నారు