బయ్యారం,జులై21(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఉప్పలపాడు నుండి గౌరారం వరకు గల చెరువు సంబంధించిన పూడికతీతలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఉప్పలపాడు చెరువు తూము షట్టర్లు పూర్తిగా పోవడం వలన నీరు ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువు నీరు కాలువల ద్వారా విడుదల కాగా తూము షట్టర్లు పనిచేయకపోవడంతో చెరువులో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును నమ్ముకొని ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందని వాపోయారు. తక్షణమే ఉప్పలపాడు కాలువలు పూడికతీత చేపట్టి, షట్టర్ మరమ్మత్తులు జరిపించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ తరుపున డిమాండ్ చేశారు. Attachments area

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై ముఖ్యంగా పాలపై మరియు పాల ఉత్పత్తులపై 5% జి ఎస్ స్టీ ఎత్తివేయాలని పెబ్బేరు  టి ఆర్ ఎస్  పార్టీ పట్టణ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో  సుభాష్ చౌరస్తాలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.సందర్భంగా దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై   విధించిన జి ఎస్ స్టి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
  కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్, మార్కేట్ కమిటీ చైర్మన్ శ్యామల మన్యం , కౌన్సిలర్లు అక్కమ్మ, ఎల్లారెడ్డి, కో-ఆప్షన్ ముస్తాక్,టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాలరాం,నాగిరెడ్డి, భారతి, ఖాజా, శాంతన్న,మన్యం తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area