బయ్యారంలో కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి
-తెరాస నేత హరీశ్‌రావు
మెదక్ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. బయ్యారం గనులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా బంద్ నేపధ్యంలో ఆయన సిద్ది పేటలోని అర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ వనరులను దోచుకుంటామని ముఖ్యమంత్రి అంటుంటే.. మిగిలిన పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని మండి పడ్డారు.