బయ్యారం గనుల తరలింపు జీవో రద్దుచేయాలి
కొత్తగూడ: బయ్యారం గనుల తరలింపు, జీవో రద్దును డిమాండ్ చేస్తూ ఈ రోజు తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈసం సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణలోని ఖనిజ సంపద తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. ఇక్కడి నుంచి విశాఖకు ఖనిజ సంపదను తరలించాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ బిక్షంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, సత్యం, బాలకొమ్రు తదితరులు పాల్గొన్నారు.