బయ్యారం ప్రధాన రహదారి పై ఎట్టకేలకు సర్పంచుల ఫోరం లో స్పందన
రోడ్డు పరిస్థితి గురించి ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జనంసాక్షి
బయ్యారం,ఆగష్టు06(జనంసాక్షి):
మహబూబాబాద్ నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి బయ్యారం పెట్రోల్ బంకు నుండి లారీ ఆఫీస్ ప్రాంతంలో ప్రమాదకరంగా మారింది. పెద్ద పెద్ద గుంతలతో అస్తవ్యస్థంగా తయారయ్యింది. ఈ విషయమై మే 03 న జనంసాక్షి వరుస కథనాలు వేసినప్పటికీ తాత్కాలికంగా గుంతలను పూడ్చి మమ అనిపించారు.వేసవి కాలం వెళ్లి వరుసగా వర్షాలు కురవడంతో మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్థితి. ఈ విషయమై అధికారులు ఆమోధిత జాతీయ రహదారి లో ఆర్ అండ్ బీ శాఖ ఎటువంటి మరమ్మత్తులు తమ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు.కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వర్షపు నీరు ప్రధాన రహదారి పై నిలిచి ఉండడంతో దారి పైన గుంతలు సైతం నీటితో నిండడంతో ప్రమాదం పొంచి ఉన్నదనే భావనతో బయ్యారం మండల సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో బయ్యారం మండలం పెట్రోల్ బంకు లారీ ఆఫీస్ మధ్యలో ఆర్ అండ్ బి రోడ్డు, వర్షపు నీరు చేరడంతో రోడ్డు మొత్తం జలమయమై గుంతలు ఏర్పడి ఇక్కడ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని,దీనిపై సంబంధిత ఆర్ అండ్ బి ఏఈ కి స్థానిక సర్పంచ్ ఫోన్ చేస్తే ఇది నేషనల్ హైవే అధికారులకు హ్యాండోవర్ చేసారని, జాతీయ రహదారి ఏఈ ని సంప్రదించాలని తెలిపారని,అట్టి ఏఈ కి గత వారం రోజులు నుంచి ఫోన్ చేస్తుంటే స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకొని, ఆ సమస్యను పరిష్కరించకుండా దాట వేస్తున్నారని,ఇదివరకే ఇక్కడ ఒకరిద్దరి ప్రాణ నష్టం కూడా జరిగిందని, తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని,ఇంకా నష్టం జరగకముందే తక్షణమే సంబంధిత అధికారులు దీనిపై స్పందించి తగు మరమ్మత్తులు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని,బయ్యారం మండల సర్పంచ్ ల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో బయ్యారం మండల సర్పంచ్ లు ధనసరి కోటమ్మ,నీలమ్మరామునాయక్, సుధాకర్,పోలేబోయిన వెంకటేశ్వర్లు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.