బస్సులో అగ్నిప్రమాదం..20 మంది మృతి
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోరం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తమ ప్రాణాలను రక్షించుకున్నారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు చోటు చేసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మార్చి 21న థాయ్‌లాండ్‌లో ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు.