బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు
దంతాలపల్లి: వృద్ధులు, వితంతువుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎం. వెంకన్న మాదిగ విజ్ఞప్తి చేశారు. దంతాలపల్లిలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, వితంతువులకు రూ.1000ల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సభకు వితంతువులు, వృద్ధులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం కోరారు.