బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుగులోత్ రవీందర్ నాయక్. – ప్రజల సంక్షేమం కోసమే బిఎంపి పార్టీ అవతరించింది.
డోర్నకల్, నవంబర్-10, జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్, రాష్ట్రీయ పరివర్తన్ మోర్చా లోని భాగస్వామ్యం పార్టీలు కులాసంఘాలు,ప్రజా పార్టీ లు బలపరిచిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి గుగులోతు రవీందర్ నాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్పిఎం నేషనల్ కన్వీనర్ వామన్ మేస్రాం, బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో బహుజన్ ముక్తి పార్టీ మేనిఫెస్టో ప్రకారం జనాభా ధమాష ప్రకారం అన్ని కులాలకు 100% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో అమలు చేస్తాం, కులాల వారీగా జనాభా జనగణన చేస్తామని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు,జనబా నిష్పత్తి ప్రకారం బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రకులాల మహిళలకు అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు.అదేవిధంగా విద్య,వైద్యం ను జాతీయం చేసి ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని, పరిశ్రమలను జాతీయం చేసి ప్రతి ఇంటికి గ్యారెంటీ ఉద్యోగము లేదా ఉపాధి కల్పిస్తామని, తక్షణమే 2.5 లక్ష్యాల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, రైతు పండించిన పంటకు ధర నిర్మించే అధికారం రైతులకే కల్పిస్తామని డోర్నకల్ నియోజకవర్గ బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి గుగులోత్ రవీందర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ ముక్తి పార్టీ మండల నాయకులు రాము నాయక్, నరేష్, వినోద్, కళ్యాణ్ రమేష్,శ్రీను,రాంబాబు, రవి,గణేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.