బాబు లేఖ ఇవ్వడం అనివార్యమైంది…!

తెలంగాణ విషయంలో బాబు స్టాండ్‌ మారిందా..? రెండుకళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీని కళ్లులేని కబోధిలా మార్చిన బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇవ్వాలని నిర్ణయించు కోవడానికి కారణమేంటి..? ఇదే ఇపుడు తెలంగాణ ప్రజల మన స్సులో ముసురుకుంటున్న ఆలోచనలు..వచ్చిన తెలంగాణను అడ్డు కొన్న బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇస్తామనడానికి కారణమేందో ఎంత ఆలోచించినా తెలంగాణ ప్రజలు అర్థం కావ డం లేదు…అసలు విషయం ఏందంటే గత ఎనిమిదేళ్లుగా అధికా రానికి దూరంగా ఉన్న ఇక ఎలాగైనా వచ్చేసారైనా అధికారంలోకి రావాలనుకొంటున్నాడు..అందుకే ఓ కార్యక్రమాన్ని నిర్వహించాల నుకొంటున్నాడు..2004లో వైయస్‌ పాదయాత్ర చేసి అధికారం లోకి వచ్చాడట…చంద్ర’బాబు’ కూడా పాదయాత్ర చేసి అధికారం లోకి వస్తాడట..అయితే ఇందులో తాజా వార్త ఏందంటే అక్టోబర్‌ 2 నుండి మొదలుపెట్లే యాత్ర అదిలాబాద్‌ నుండే షురూ చేస్త డట…అగో అందుకే తెలంగాణలో అడుగుపెడ్తే ఎక్కడ నిలదీస్తరో నని భయపడ్డడు..అందుకే లేఖ ఇస్తానంటూ ప్రకటిస్తున్నడు.. అయినా బాబుకు లేక ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడ్డది తెలం గాణలో..ఎందుకంటే లేఖ విషయంలో ఇప్పటికే ఒక సారి మోస పోయిన తెలంగాణ ప్రజలు..మరోసారి నమ్మడానికి, నమ్మిమోసపో వడానికి సిద్ధంగా లేరు..2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే తన కొంపలేవో మునిగిపోయి నట్లు చాలా తీవ్రంగా స్పందించాడు..ఓ వైపు తెలంగాణలో సంబ రాలు జరుగుతండగానే ఆయన మీడియా ముందుకొచ్చి రాత్రికి రాత్రే తెలంగాణ ఎట్లిస్తరు అన్నడు..కర్ణాటక లుండే మొయిలీ.. తమిళనాడు  చిదంబరంలకు తెలంగాణపై నిర్ణయం తీసుకొంటరని ప్రశ్నించిండు..నేను తెలంగాణకు అనుకూలం అనలేదని తెలిపిం డు..ఇగ అప్పటి నుండి మొదలు ఇప్పటి దాకా ఎపుడూ కూడా తెలంగాణపై ప్రశ్నలడిగితే సమాదానాలు సరిగ్గా చెప్పలేదు..నేను రాజ్‌ న్యూస్‌లో పనిచేస్తుండగా ఓ సారి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలంగా ణపై టీడీపీ స్టాండ్‌ మారిందా అంటే రెండు కళ్ల సిద్ధాంతం గురించి చెప్పిండు..ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖకు మీ పార్టీ కట్టుబడి ఉందా అంటే ఆ లేఖ అప్పటి  పరిస్థితులలో ఇచ్చిందని, ఇపుడు ఇరు ప్రాం తాల నేతలు వారి వారి ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగు ణంగా పనిచేస్తరన్నడు..మరోసారి తెలంగాణ జిల్లాల్లో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకం కాదు.. అను కూలమూ కాదు…అంటూ పాతపాటే పాడిండు..అంతే తప్ప తెలం గాణకు అనుకూలం అంటూ ఏనాడూ చెప్పలేదు..ఎందుకంటే తెలంగాణకు జై అంటే రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి..అందుకే మహానాడులో బాబు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని..తెలుగు భాషను కాపాడాలని వీరావేశంతో ఉపన్యసించడు..రాష్ట్రం కాపాడుకోవడం అంటే ..సమైక్యాంధ్రకు కట్టబడి ఉండడమే..ఆవిధంగా తన మన సులో మాటను తెలివిగా బయటపెట్టుకొన్నడు..శ్రీకృష్ణ కమిటీకి కూ డా ప్రాంతాల వారీగా అభిప్రాయాలను చెప్పించిన బాబు పార్టీ అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు..అయితే ఆయన ఢిల్లీలో ఉన్న పుడు ‘చీకట్లో చిదంబరం’ అనే నాటకం ఆడినపుడు ఆయన అసలు రంగు బయటపడ్డది..చిదంబరాన్ని ఏకాంతంగా కలిసి తెలంగాణ ఇవ్వద్దన్నాడన్నడు బాబు..తెలంగాణ అంశంపై టీడీపీ ఎంపీలు లొల్లి చేస్తే మీ అధినాయకుడు ఇవ్వొద్దన్నడని చెప్పిండు అన్న చిదం బరం మాటలకు నేను అసలు చిదంబరాన్ని కలవనే లేదు అని కౌంటర్‌ వేసిండు..అయితే మినిట్స్‌ బయటపెడతనన్న చిదంబరం మాటలతో బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.. అయి తే ఇపుడు లేఖ ఇస్తాననడానికి కారణం తాను పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలని బాబు ఆకాంక్షే..అయితే తెలంగాణపై తన వైఖరి బయటపెట్టకపోతే..అనుకూలంగా లేకపోతే ఎక్కడ తెలంగా ణ ప్రజలు నిలదీస్తరోనని బయపడ్డడు.. దాని వల్ల పాదయాత్ర ఏమయితది అంటూ వణికిండు..దానికన్నా ఇంట్ల కూసుంటెనన్న నాలుగు ఓట్లు పడతయి అనుకున్నడు…రాజశేఖర్‌ రెడ్డి ప్రభంజనం లో కూడా తెలంగాణలో 30 పైచిలుకు ఓట్లు గెల్చుకొన్న టీడీపీ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేక పోయింది..అయితే ఇందులో కొద్ది మంది బాబు వైఖరి వల్ల విసిగి పోయి బయటకు వచ్చిండ్రు..బాబు లేఖ ఇవ్వకపోవడం వల్ల తెలం గాణలో టీటీడీపీ నాయకులకు తెలంగాణలో మొఖం చెల్లలేదు.. అందుకే ఇష్టం లేకున్నా లేఖ ఇవ్వడానికి బాబు పూనుకొంటు న్నాడు..ఏది ఏమైనా 1968లో ప్రారంభమైన జై తెలంగాణ ఉద్యమానికి పోటీగా వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా పుట్టుకొచ్చిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు లాంటి కరుడు గట్టిన వాళ్లు కూడాఇపుడు జై తెలంగాణ అంటున్నరంటే అది తెలంగాణ ప్రజల ఉద్యమ విజయమేజజిదే స్పూర్తిని కొనసాగించి తెలంగాణ తెచ్చుకొనేవరకు పోరాడాలె…