బారి వర్షాలకు నష్టపోయిన బాధితులకు సర్పంచ్ ఆర్థిక సాయం

జులై 11 ( జనంసాక్షి)
 మహాదేవపూర్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి  కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిన ఇండ్లను సర్పంచ్ శ్రీపతిబాపు పరిశీలించారు.   నష్టపోయిన బాధిత కుటుంభాలను పరామర్శించి, తన వంతు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.ప్రకృతి విపత్తు వల్ల కలిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి,ప్రభుత్వం నుండి సాయం అందించేలా చూస్తామని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఉప్పరి వాడ దామర చెరువు పొలిమేరలో కావేటి కమలమ్మ,ఇందిరా నగర్ ఎస్ సి కాలనీలో చింతకుంట్ల లక్ష్మీ ఇండ్లు పూర్తిగా కూలి నేలమట్టం కాగా,అదే కాలనీలో పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య ఇంటి పై కప్పు కూలిపోయి,ఇంటి గోడలు పాక్షికంగా ధ్వంసమవ్వగా,ధ్వంసమైన నలభూగ ముత్తమ్మ ఇంటి గోడలను,ఇల్లు ను సర్పంచ్ శ్రీపతిబాపు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెరుగు స్వప్న,భీముని  వెంకటస్వామి,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నా