బాలికలు ఈ సమాజానికి ఎంతో విలువైన సంపద…
వారు చదువులతో పాటు ఆరోగ్యం పైనా దృష్టి పెట్టాలి….
బాలికల హక్కుల పరిరక్షణ లో అధికార యంత్రాంగం అంకితభావంతో సేవాలందించాలి.
జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య…
ములుగు బ్యూరో,అక్టోబర్11(జనం సాక్షి):-
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగము,స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా లోని విఉద పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు వారి హక్కులపైన అవగాహన కల్పించడం జరిగింది.జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో ఉన్న ఆడిటోరియం లో జిల్లా సంక్షేమాధికారి ఈపి. ప్రేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హాజరై మాట్లాడుతూ బాలికలు ఈ సమాజానికి ఎంతో విలువైన సంపద అని,
వారు చదువులతో పాటు ఆరోగ్యం పైనా దృష్టి పెట్టాలని బాలికలపై సూచించారు. పిల్లలు ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి తప్పులు చేయనప్పటికీ, వారు ఏమైనా వేధింపులకు గురైతే బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ సతమతం అవుతారు. ఇలా ఇబ్బంది పడుతున్న పిల్లలు చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ కి కాల్ చేసి సంప్రదించడం ద్వారా అక్కడ ఉన్న సైకాలజీ నిపుణులు పిల్లలకి సరైన మార్గనిర్దేశం చేస్తారని పిల్లలకి సూచించారు.బాలికలు చక్కగా చదువుకోవాలని,అదే మనకి ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు.చాలా మంది మహిళలు రక్తహీనతకి గురవుతున్నందిన బాలికలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితేనే భవిష్యత్ పుట్టబోయే సంతానం కూడా ఆరోగ్యవంతముగా ఉంటుందని అన్నారు.మహిళలకు ఆర్థికపరమైన స్వేఛ్చ ఉండాలని,ఉద్యోగం, వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాలని ఎంచుకోవడం ద్వారా సమాజంలో ఓ గుర్తింపు ఉంటుందని అన్నారు.ముఖ్యంగా విద్యార్థులకు చదువు మాత్రమే కాక చక్కని ప్రవర్తన కూడా చాలా ముఖ్యం అని సూచించారు. బాలలపైన జరిగే వివిధ రకాల వేధింపులను నిరోధించడానికి రూపొందొమచిన చట్టాలపై సంబంధించి బుల్లెట్ పాయింట్స్ తో కూడిన కరపత్రాలు, వాల్ పోస్టర్ లను రూపొందించాలని జిల్లా సంక్షేమాధికారి గారికి సూచించారు. అదేవిధంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులందరికీ ఈ చట్టాలపైన అవగాహన కలిగిస్తే వారికి ఏ సమస్య రాకున్నా భవిష్యత్ లో వారి సాటి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటారని డిఈఓ కి సూచించారు.
పిల్లలంతా తల్లితండ్రులను గౌరవిస్తూ, ఆరోగ్యంగా ఉంటూ చక్కగా ఎదగాలని , అది వారి హక్కు అని ఉద్భోదించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా అదనపు కలెక్టర్ వైవీ గణేష్ ర్యాలీని ప్రారంభించారు. బాలికల హక్కులపై కలెక్టరేట్ నుండి మెయిన్ రోడ్ వరకు బాలికలు తమ హక్కులను పరిరక్షించుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.అనంతరం జాతీయ రహదారి 163 పైన మానవహారం నిర్వహించారు.అనంతరం బాలికల హక్కుల పరిరక్షణకు సంతకాల సేకరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే.రమాదేవి, డిఈఓ ఫణిని,ఏఎల్ఓ వినోద,జిల్లా యువజన మరియు క్రీడా శాఖాధికారి రమణాచారి, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ కే. స్వాతి,డిసిపిఓ జే.ఓంకార్, డిసిపియు,చైల్డ్ లైన్ సిబ్బంది, డిఆర్డిఎ ఏపిడి, వివిధ శాఖలకి చెందిన అధికార యంత్రాంగం,విఓఏ లు, వివిధ ప్రభుత్వ,ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు,విద్యార్థినీవిద్యా ర్థులు పాల్గొన్నారు.