*బాలికల హక్కులను పరిరక్షించాలి* – సూర్యాపేట చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): బాలికల హక్కులను రక్షించాలని సమగ్ర బాలల పరిరక్షణ పథకం సూర్యాపేట చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్ అన్నారు. ఈదులవాగు తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ బోడా ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు బాలబాలికల హక్కులను పరిరక్షించడానికి ప్రతి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారన్నారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తారన్నారు. చిన్నపిల్లల పరిరక్షణ విషయంలో 1098 నెంబర్ సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రంశెట్టి పిచ్చయ్య, అంగన్వాడి టీచర్ పార్వతి, నగేష్ కుమార్, అభినవ్, సరిత, జీవిత, శాంతి, వినోద్, రాజు, సునీత, శివాజీ, నరసింహారావు, పావని తదితరులు పాల్గొన్నారు.