బావురుగొండ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గంగారం మండలం ఆగస్టు 9 (జనం సాక్షి)
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.. కావున ఈ సందర్భంగా ఆదివాసీ పేసా కమిటీ గంగారం మండల అధ్యక్షులు ఈక సురేందర్ ఆధ్వర్యంలో బావురుగోండ గ్రామ పంచాయతీ లో ఆదివాసీ జెండా ఎగురేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఈక సురేందర్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలందరికీ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు..అలాగే
కొండకోనల్లో అడవుల మధ్య బతుకుతూ.. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుల్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు ఆదివాసీల జీవన శైలి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆదివాసీల జీవనస్థితిగతుల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించలేదని. నేటికి వైద్యం, విద్య, మౌలికవసతుల కల్పన వంటి వాటికి ఆదివాసీ గ్రామాలు దూరంగానే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆదీవాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆగష్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ ఎఫ్ఫైర్సై్ ఇండిజినియస్ పీపుల్స్’ విభాగం ఆధ్వర్యంలో ఆదీవాసీల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని.
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు మారినా అడవి బిడ్డల బతుకులు మారడంలేదు. అడవి తల్లిని వదిలి బయటకు రావడానికి ఆదివాసీలు ఇష్టపడరు. కష్టమైనా.. నష్టమైనా అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. కావున ఆదీవాసీల గ్రామాల అభిరుద్దికి ప్రభుత్వం కృషి చేయాలని సురేందర్ కోరారు.. ఈ కార్యక్రమంలో బావురుగోండ ఉప సర్పంచ్ ముడిగ లక్ష్మినారాయణ, వార్డు మెంబర్ ఈక నరేష్,మహిళలు ,యువకులు,ప్రజలు పాల్గొనడం జరిగింది.