బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిర్మల్,ఏప్రిల్20(జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు కూడా కావడంతో ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఓవైపు పౌర్ణమి.. మరోవైపు హనుమాన్ జయంతి సెలవుదినం కావడంతో.. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. ప్రతీ పౌర్ణమి మాదిరిగానే దేవస్థాన పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభదినం కావడంతో తమ పిల్లలకు అక్షర శ్రీకారం జరిపించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే శనివారం కూడా రద్దీ కనిపించింది. ఆదివారం కూడా ఉంటుందని ఆలయ అధికారులు అన్నారు.