విమానాశ్రయంలో 10 కిలోల బంగారం పట్టివేత..
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్ నుంచి దిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కన్పించడంతో వారి బ్యాగేజీలను స్కాన్ చేశారు. (Delhi Airport) దిగిన ఇద్దరు ప్రయాణికుల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 10 కిలోల బంగారాన్ని (Gold) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదు. దీంతో ఆ ప్రయాణికులను తనిఖీ చేయగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్ట్‌లను గుర్తించారు. వాటిని పరిశీలించగా ఇద్దరి వద్దా రూ.5 కిలోల చొప్పున వందలకొద్దీ బంగారు నాణేలు బయటపడ్డాయి. ఎలాంటి పత్రాలు లేని ఈ బంగారాన్ని అక్రమంగా దేశంలోకి (Gold Smuggling) తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 10.092 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.8 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిందితులిద్దరూ కశ్మీర్‌కు చెందినవారిగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారు నాణేల ఫొటోలను దిల్లీ కస్టమ్స్ అధికారులు ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేశారు.