బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు అస్వస్థత చాలా బాధాకరం

-బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పాలెం వెంకటయ్య

మక్తల్, జూలై 17 (జనం సాక్షి)

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో కలుషితా ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు తక్షణమే మంచి వైద్యం అందించాలని, కలుషిత ఆహారానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెంటనే తన పదవి నుండి బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పాలెం వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అయిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తున్నదని రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు తగదన్నారు విద్యార్థులకు ఏలాంటి ప్రాణ నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను పట్టించుకోని కలుషిత ఆహారానికి కారకులైన ఎంతటి వారైనా విధుల నుంచి తొలగించాలని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని వెంకటయ్య అన్నారు. లేని యెడల బియస్పి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇట్టి సమావేశంలో నారాయణపేట జిల్లా ఇంచార్జి అర్జున్ రాజ్, జిల్లా ప్రధానకార్యదర్శి జుట్ల నరేందర్, ఆర్గనైసింగ్ సెక్రెటరీ బండారు చెంద్రశేకర్, బి ఎస్ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్, రమేష్ టీచర్, మాగనూర్ మండల కన్వీనర్ ఎండి హాజీ బాబా, కొల్పుర్ గ్రామ అధ్యక్షుడు బాల్ రాజ్ ,ఉజ్జెల్లి గ్రామ అధ్యక్షుడు కోటికె రాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.