బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళనంకు  ఏర్పాట్లు

 

 

 

 

 

 

 

బిఆర్ఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్

దోమ జనవరి 11(జనం సాక్షి)
దోమ మండలం కేంద్రంలో ఈనెల 13వ తేదీ నాడు జరిగే బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళనంకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మెళనంకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి,ఎంపిపి,వైస్ ఎంపిపి,పిఏసీఏస్ చెర్మన్, రైతు సమితి అధ్యక్షులు, కో అప్షన్ సభ్యులు, మండల సర్పంచులు,ఎంపిటిసిలు హాజరువుతున్నారు.కావున మండల ప్రజలు, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువనాయకులు హాజరై ఆత్మీయ సమ్మెళనంను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమం ఏర్పాట్లలో కో అప్షన్ సభ్యులు ఖాజాపాష, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డప్పు శేఖర్, వార్డ్ సభ్యులు డప్పు రమేష్, మైను, బండి సాయిలు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చోటు, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.