బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు
-భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి
-ఖాళీ అవుతున్న ప్రతిపక్షాలు
-బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు
-వందల సంఖ్యలో పార్టీలో చేరికలు
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో నవంబర్13 (జనంసాక్షి)ఏ పని మొదలు పెట్టిన భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని చేయడం వల్లనే ఇన్ని అద్భుతాలు జరుతున్నాయనిరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని మంత్రి నివాస గృహంలో ఖిల్లా ఘనపురం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయిల్ ఫామ్ అడ్వైజర్ లక్ష్మారెడ్డి, రాష్ట్ర సహకార శాఖ డైరెక్టర్,మోడల పురుషోత్తం , మండల పార్టీ ఉపాధ్యక్షుడు సురేందర్ ల ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్, బిఎస్పీ నాయకులు, రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ రఘు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వర్యంలో 15 మంది డిఎస్పీ నాయకులు, గోపాల్ పేట మండలానికి చెందిన జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి చంద్ర శేఖర్, మండల అధ్యక్షుడు కోదండం, గ్రామ అధ్యక్షులు గుండ్రతి రాజేష్ గౌడ్, గోపాల్, మాజీ మండల అధ్యక్షుడు బాలరాజు, ఆటో యూనియన్ సభ్యులు కాంగ్రెస్, వివిధ పార్టీల నుండి 52 మంది, జిల్లా కేంద్రం లోని 4వ వార్డు కురుమూర్తి, బాలరాజు, సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో 110 మంది యువకులు, 25 వ వార్డు అఖిలెందర్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు, జిల్లా కేంద్రానికి చెందిన 60 మంది ప్రజలు స్వచ్ఛందంగా వేరు వేరుగా మంత్రి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ముందుగా వారికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మ్యానిఫెస్టో ఉందన్నారు. స్వరాష్టం పాలన ఏర్పడిన తరువాత ఆదాయ వనరులు ఎట్లా పెరిగితే ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కేసిఆర్ ఆరోగ్య రక్ష ద్వారా గరిస్ట పరిమితి రూ 15 లక్షల వరకు పెంపు, అన్ని ఆసరా పింఛన్లు దశల వారీగా రూ 5016 కు, దివ్యంగులు దశల వారీగా 6 వేలకు పెంపు చేస్తామని చెప్పిన ప్రతి పనిని బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని మంత్రి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఆయా మండలాల నాయకులు, ఆయా వార్డుల నాయకులు బేకరీ మన్యం,సంకెళ్ల బీరయ్య, వనపర్తి పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క మహేష్,దాసరి రాజేష్, దాసరి కృష్ణ, మన్నెం, వంశీ , మహిళలు తదితరులు పాల్గొన్నారు