బిజెపి అవినీతి ఆరోపణలపై బాబు కప్పదాటు
ప్రత్యేకహోదా పోరులో టిడిపి పూర్తిగా వైపల్యం చెందింది. కేవలం ఇది తమ సమస్య అన్నరీతిలో సాగుతూ ఇతర పార్టీలపై బురదజల్లుతూ పోతోంది. ఉమ్మడి సమస్యలను ఉమ్మడిగా పోరాడి సాధించాలన్న సంకల్పం దెబ్బతింది. అందరిని కలుపుకుని పోయేలా టిడిపి వ్యవహరించడం లేదు. అలాగని తాను విమర్శలు చేయడం రైటుగా, ఇతరులు ¬దాపై మాట్లాడితే తప్పనేలా కూడా ప్రచారానికి దిగుతోంది. ఎదురుదాడి చేస్తోంది. ప్రత్యేక ¬దాపై బిజెపి నమ్మక ద్రోహం చేసిందని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని చంద్రబాబు ప్రకటనలు, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా బిజెపిఅంటకాగిన బాబు ఎందుకు ఆనాడే గట్టిగా పోరాడలేకపోయారో చెప్పడం లేదు. ప్రత్యేక ¬దాతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఆత్మగౌరవం చంపుకోలేకే ఎన్డీయే నుంచి తాము బయటకు వచ్చేశామని తెలుగుదేశం అధినేత ఇప్పుడు సెలవిస్తున్నారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని ఆత్మగౌరవం ఇప్పుడే గుర్తుకొచ్చిందా? మరో ఆరునెల్లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రానున్నందున రాజకీయలబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ నాటకమాడుతోందని చెప్పడానికి ప్రజలు రాజకీయ పండితులే కానక్కర్లేదు. చంద్రబాబు గురించి కనీస అవగాహన వున్నవారెవరైనా ఈ విషయం చెప్పేస్తారు. బిజెపి పంచన ఇంకా కొనసాగితే తమ పార్టీకి పుట్టగతులుండవని గ్రహించిన చంద్రబాబు ఒక్కసారి ప్లేటు ఫిరాయించారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు ¬దానే ముద్దు అన్నారు. నాలుగు సంవత్సరాలు బిజెపితో కలిసి కేంద్రంలో అధికారంలో కులికిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రత్యేక ¬దా పాట అందుకున్నంత మాత్రాన బిజెపి చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం కాదు. అలాగే నాలుగేళ్లుగా ఆపోరాడుతున్న వారిని ఎందుకు పక్కన పెట్టారో చెప్పడం లేఉదు. దీంతో టిడిపి నిజాయితీపై ఇప్పుడు ప్రజల్లో సహజంగానే చర్చ సాగుతోంది. నాలుగేళ్లుగా ఆయన అయిదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పక్కన పెట్టి బిజెపితో ఎలా రాజీ పడిందీ, గత నాలుగేళ్లలో ఏ విధంగా ఇతర పక్షాలను దునుమాడిందీ గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని ఉంటే బాగుండేది.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న తరువాతనే వైకాపా ఎత్తుకున్న నినాదాన్‌ఇన హైజాక్ చేశారని చెప్పాలి. వైకాపా ఎప్పటి నుంచో ప్రత్యేక¬దాపై ఊరూవాడా పోరాడుతోంది. అయితే దానిని జాతివ్యతిరేక పోరాటం తీరులో బాబు అభివర్ణించిన రోజులు ఉన్నాయి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, విమర్శించడం కేవలం టిడిపి సొత్తు అన్న తీరుగా
చంద్రబాబు ఉద్శేశం ఉన్నట్లుగా ఉంది. విస్తృతమైన మద్దతును కూడగట్టడం అన్న అంశాల జోలికి వెల్లడం లేదు. ఉమ్మడి పోరాటాన్‌ఇన పక్కన పెట్టారు.అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిన తెలుగుదేశం అధినేత ఇన్నాళ్లు తాను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరించాక ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పోరాటాలకు దిగుతున్నారు. అయితే బిజెపి నేతలు తక్కువేం తినలేదు. వారు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవ్వకుండా వందిమాగధులతో ఎదురుదాడి లేదా ప్రతివిమర్శలు చేయిస్తున్నారు. అవకాశవాద వైఖరే ఆయన రాజకీయ నీతికి తార్కాణంగా చూడాలి. ప్రత్యేక ¬దాపై తెలుగుదేశం ఆడిన డ్రామాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి.2016 సెప్టెంబరు7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఎంతమాత్రం ప్రత్యేక ¬దాతో సరితూగదని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఆనాడే మొత్తుకున్నా వినకుండా ప్రత్యేక ప్యాకేజి అద్భుతం అంటూ కేంద్ర ప్రభుత్వ చర్యను బాబు స్వాగతించారు. ప్రత్యేక ¬దాను మించిన ప్యాకేజీ ఇచ్చారంటూ బిజెపిని ఆకాశానికెత్తుకున్నారు. విమర్శలు చేసిన విపక్షాలను ఒకే
గాటన కట్టి తీవ్రంగా విమర్వలు చేశారు. ఆనాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని గన్నవరం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి, విజయవాడలో సన్మానం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి 70వేల కోట్ల లబ్ధి చేకూరుతుందని ఊదరగొట్టారు. ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకించినవారంతా రాష్ట్ర ద్రోహులన్నారు. ప్రత్యేక ¬దా ఏమైనా సంజీవనా అంటూ ఎకసెక్కాలాడారు. ¬దా కోసం ప్రజలను కదిలించి పోరాడిన వామపక్షాలు, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలపై కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. తీరా ఇప్పుడు గతాన్‌ఇన మరచిపోయి ¬దా కోసం పోరు అంటూ రోడ్డెక్కుతున్న తీరు ప్రజల్లో విమర్శల పాలవుతోంది. ¬దా గతించిపోయిన అంశం అని పదేపదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా జ్ఞానోదయమైనట్లు మాట్లాడడమే విడ్డూరంగా వుంది. నిజానికి బాబు చిత్తశుద్దిగా ఉంటే ప్యాకేజీపై మోసాన్ని ఎండగట్టి విపక్షాలతో కలసి పోరాటం చేసివుంటే ప్రజలు నమ్మేవారు. చంద్రబాబు ఇప్పుడైనా నిజంగానే ప్రత్యేక ¬దా కోసం పాటుపడుతున్నారా అంటే సందేహమే. ప్రజల సానుభూతి పొందాలన్న యావే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ధ్యాస కనిపించడం లేదు. ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హావిూల అమలు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే సాహసం చేశారా అంటే అదీ లేదు. ఆత్మవిమర్శ చేసుకోకుండా, ఆంధ్రుల ఆత్మగౌరవం గురించే మాట్లాడితే ప్రజలు హర్షించరు. అవినీతిపైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.