బిజెపి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 27:
జనంసాక్షి
కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణ పాతబస్ స్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు,పద్మశాలి రాష్ట్ర నాయకులు సాంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం రాజీలేని పోరాటం చేసి పదవులను త్యాగం చేసి చివరి క్షణం వరకు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాటం చేసి, ప్రజల గుండెల్లో అమరుడైన బాపూజీ అని అన్నారు
ఈకార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్,బీజేపీ సీనియర్ నాయకులు జోగ రాజగంగారాం,పిన్నంశెట్టి గంగాధర్,బీజేపీకౌన్సిలర్లు మర్రి పోచయ్య, జక్కని సుజాత కుందన్,నాయకులు జోగ జగదీశ్వర్,లక్ష్మణ్,నారాయణ,
తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు