బిజెపి ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండాయే
*రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఉపఎన్నిక
*బీజేపీ మూడో స్థానానికే పరిమితం
*రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్
మునుగోడు అక్టోబర్09(జనంసాక్షి)
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది గులాబీ జెండాయే మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే వచ్చింది మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఆదివారం మునుగోడు మండలం,కొరటికల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వామపక్షాలు,ముఖ్య కార్యకర్తలతో సమావేశం,దళిత వాడల్లో ఆత్మీయ సమ్మెలనంలో మంత్రి పువ్వాడ అజయ్,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాలుగొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు కేటీఆర్,హరీష్,జగదీష్, ఇలా మంత్రులంతా ఎంపీటీసీ పరిధి ఇన్చార్జిగా ఉన్నారుని టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పట్టుదలతో పని చేయాలిని సూచించారు.మునుగోడు ఉప ఎన్నికను దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందని,బిజెపి రాజగోపాల్ రెడ్డి కుట్రలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పార్టీ మార్పు 22వేల కోట్లు కోసం కాదు18 వేల కోట్ల ప్రాజెక్ట్ అంటూ స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడని అన్నారు. ఆర్ఎస్ఎస్,మత చాందసవాదులు మీ గ్రామాల్లోకి వచ్చి చొరపడ్డారు,గ్రామాల్లో ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు.హిందూ మత సంస్కృతి, సాంప్రదాయాలను బిజెపి వచ్చిన తర్వాతే మొదలైందా తెలంగాణ తొలిదశ,మళ్దశ ఉద్యమాలలో బీజేపీ పాత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.మునుగోడు ప్రజలను నట్టేట ముంచిన ఘనుడు రాజగోపాల్ రెడ్డి,దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణం,అందుకే బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి కేసిఆర్అరంగ్రేటం చేశారు.క్యాడర్లో ఉన్న చిన్న చిన్న పొరపచాలు వదిలేయండి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడండి,గ్రామ ప్రజలపై పెత్తనానికి రాలేదు మీతో కలిసి పనిచేసేందుకే వచ్చాము అని అన్నారు.ఈకార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,ఎంపీపీ కర్నాటి స్వామి,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి,మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం,గ్రామసర్పంచ్ వల్లూరి పద్మలింగయ్య,ఉప సర్పంచ్ ఎల్లంకి యదయ్య,
ఎంపిటిసి మిరియాల లక్ష్మమ్మబీరయ్య,గ్రామశాఖ ఐతగొని శేఖర్, కార్మిక విభాగం నియోజకవర్గ ఇన్చార్జి దండు యాదయ్య,టిఆర్ఎస్వి రాష్ట్రనాయకులు సిగమల కిషోర్ బాబు,సీనియర్ నాయకులు బేరి గురుపాదం,మురాసేటి యాదయ్య,నీల ఎంకన్న,సిపిఐ జిల్లాకార్యదర్శి నెలికంటి సత్యం,అయిదుగోని లాల్,చాపల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.