బిపిఇటికి దరఖాస్తుల ఆహ్వానం

కడప, జూలై 25 : జిల్లాలో బిపిఇటి ఒక సంవత్సరం కోర్సు చేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య ఒక ప్రకటనలో అన్నారు. 2012-13 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతున్నామని అన్నారు. మూడు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు కోర్సుల్లో చేరేందుకు అర్హులని అన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన చెప్పారు.