బి ఎస్ పి ఆధ్వర్యంలో కాన్సిరాం వర్ధంతి వేడుకలు
దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సిరాం వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నాయకులు కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ బీఎస్పీ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్, ఉపాధ్యక్షులు నల్క నరసింహులు, ప్రధాన కార్యదర్శి భూంపల్లి రాజు, కోశాధికారి సుంచు వెంకటేష్,గ్రామ కన్వీనర్లు గంగాధర్ ప్రభాకర్, షేర్ పల్లి స్వామి, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.