-బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్.

జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలై 20:-
పోరాటాల ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పట్టణంలోని ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ హాల్ నందు కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ ప్రధాని అయిన నాటి నుండి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అది సరిపోదు అన్నట్లు పాలు,పెరుగు,పప్పుదినుసులు తదితరాలపై కొత్తగా 5శాతం జిఎస్టీ తీసుకువచ్చి రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందని అన్నారు.పేదలు తిండి దొరక్కుండా ఇబ్బందులుపడుతూ కాలం వెల్లడిస్తున్నారని,మోడీ అసమర్థ పాలన వల్ల రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోయిందని దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే మోడీ గుజరాతి మిత్రుడు అధాని మాత్రం ప్రపంచ కుబేరుడు అవుతున్నడని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపదను అధాని,అంబానీ లకు దోచిపెడుతున్నడని విమర్శించారు.అవకాశవాది రాజకీయాలు పోవాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందుకు ప్రతీ నాయకుడు బూతు స్థాయిలో పర్యటన చేసి యువతరాన్ని పార్టీలోకి ఆహ్వానించి కమిటీలు త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం.మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శులు మాలోత్.వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గుడివాడ రాజేందర్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి తలగంపల.రవి తదితరులు పాల్గొన్నారు.