బీడీసీ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని వినతి పత్రం అందజేత
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):గ్రంథాలయాలలో ఒక భాగమైన గ్రామాల్లోని పుస్తక నిక్షిప్త కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని పుస్తక నిక్షిప్త కేంద్రాల నిర్వహకులు కోరారు.సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ సీతారామశాస్త్రిని కలిసి పుస్తక నిక్షిప్త కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.అనంతరం చైర్మన్ , సెక్రటరీలు ఈ విషయాన్ని డిప్యూటీ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి , సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా బీడీసీ నిర్వహకులు మాట్లాడుతూ గ్రంథాలయంలో ఒక భాగమైన గ్రామాలలో పుస్తక నిక్షిప్త కేంద్రం ద్వారా నిరుద్యోగులకు చదువుకునే వెసులుబాటు గవర్నమెంట్ కల్పించిందన్నారు. దీని నిర్వహణకు ఉన్నత చదువులు చదివిన వారు సైతం ప్రభుత్వం అందించే నెలకి 150 రూపాయల జీతం తీసుకుని పనిచేసారన్నారు.సమీప గ్రంథాలయాల నుండి 2 న్యూస్ పేపర్లు , 50 పుస్తకాలు తీసుకొని ఆ బీడీసీ సెంటర్లను నిర్వహించేలా ఆదేశాలు గతంలో జారీ అయినట్లు చెప్పారు.ప్రభుత్వం ఏదో ఒక రోజు తమని గుర్తించి, జీతాలు పెంచుతున్న ఆశతో 20ఏళ్లుగా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానీ కొంత కాలం తర్వాత రూ.150 నుండి రూ. 300, ఆ తర్వాత రూ.600కి పెంచి జీతం ఇచ్చారన్నారు.కరోనా కారణంగా బీడీసీ సెంటర్లను మూసివేశారని , తిరిగి ప్రారంభించడం లేదన్నారు.ఆఫీసర్లు,ఆఫీసుల చుట్టూ బీడీసీలు లు తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే బీడీసీలను ఓపెన్ చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు బీడీసీ నిర్వహకులు పాల్గొన్నారు.