బీమా తోనే రైతులకు ధీమా…
జోహార్ పూర్ క్లస్టర్ ఏఈఓ భూమేష్
లోకేశ్వరం ( జనం సాక్షి) రైతులు పంట పొలాలలోనికి రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు బీమా ఉంటే కుటుంబానికి ఎంతో ధీమాగా ఉంటుందని వ్యవసాయ విస్తరణ అధికారి పుప్పాల భూమేష్ అన్నారు మంగళవారం రోజున ఆయన జోహార్ పూర్ రైతు వేదికలో జనం సాక్షి ప్రతినిధి తో మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బీమా చేసుకోవడానికి ఈనెల 30 వరకు గడువు ఇచ్చినందున రైతులందరూ సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు జూన్ 22 తేదీలోపు పట్టా పాస్ బుక్కులు వచ్చిన రైతులందరూ అర్హులేనని ఆయన అన్నారు ఈ రైతు బీమాకు 18 నుండి 59 సంవత్సరాలు ఉన్న రైతులు మాత్రమే అర్హులని ఆయన పేర్కొన్నారు రైతు బీమా దరఖాస్తు ఫారం తో పాటు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకం తదితర కాపీలతో రైతు వేదిక లో అందించాలని ఆయన సూచించారు గతంలో బీమా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు రెన్యువల్ అవుతుందని అయిన వెల్లడించారు మరిన్ని వివరాలకు రైతులు రైతు వేదికలో సంప్రదించాలని ఆయన కోరారు