*బీసీలకు బందేనా!?*

ప్రతీ సామజిక వర్గానికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి*
*•బీసీ బంధుపై నోరుమెదపని ప్రభుత్వం*
బయ్యారం,సెప్టెంబర్18(జనంసాక్షి):
కులం పునాదులమీద ఒక జాతిని, నీతిని నిర్మించలేరు అన్నారు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్.కానీ ఇప్పుడు అదే కులమనే పదంతో రాజకీయం చేస్తున్నారు నేతలు. అందరికీ సమన్యాయమే అంతిమంగా రాజ్యాంగం ధ్యేయం. అందుకోసం సబ్బండ వర్గాల వారు ప్రాంతాలకతీతంగా,కుల, మత బేధం లేకుండా భారత పౌరులే అర్హులు.ఇక ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నప్పటికీ కొన్ని వర్గాలకు ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలూ అందలేదు.ఆరుకాలాల పాటు పని చేసే రైతులకు రైతు బంధుతో చేయూత,ఆర్ధికంగా వెనుకబడిన దళితులకు దళిత బంధు తో ప్రోత్సహించిన ప్రభుత్వం సెప్టెంబర్ 17 న తెలంగాణ  జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా గిరిజన బంధు ప్రకటన హర్షించందగిన విషయమే.కానీ వెనుకబడిన తరగతులు గా పేరొందిన బీసీలు అన్ని విధాలుగా వెనుకబడే ఉన్నారు.తెలంగాణ జనాభాలో 50శాతం బీసీలు ఉన్నప్పటికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేవలం 29శాతం మాత్రమే అమలు జరుగుతుంది.దశబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా బీసీలకు ఒరిగిందేమీ లేదని బీసీ కుల సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2021లో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో బీసీలకూ బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.గిరిజన బంధు ప్రకటన రావడంతో మళ్ళీ తెరపైకి బీసీ బంధు అంశం ఉత్పన్నామవుతుండడం గమనార్హం.ప్రభుత్వం బీసీ బంధు ప్రకటన ఇచ్చి ఏడాది గడుస్తున్నా, బీసీ నాయకులు దీనిపై ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టత తీసుకొచ్చే విషయంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.వివిధ కుల సంఘాలు ఎజెండా ఒకటే బీసీలకు సమన్యాయం అయినప్పటికీ కులసంఘాల ఐక్యత లేకపోవడంతో ప్రతీ విషయంలో వెంకబడిన తరగతుల వారు వెనుకబడే ఉంటున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీ నేతలు అధికారం లో ఉన్నా ఒరిగిందేమి లేదనే వాదనలు ఉన్నాయి.బీసీల ఓట్ల కోసం ఆరాటపడే నేతలకు అధికారంలోకి వచ్చాక బీసీల బాధలు కనిపించవనేది అక్షర సత్యం.ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్ధికంగా,సామజికంగా వెనుకబడిన బీసీల కుల వృత్తులను ప్రోత్సహిస్తూ బీసీ బంధు పథకం అమలులోకి తెస్తారో లేదో వేచి చూడాలి.

Attachments area