బీసీ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం.
పినపాక నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 30 (జనంసాక్షి):-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో బీసీ భవన నిర్మాణానికై రూ.50 లక్షల నిధుల కేటాయింపుపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం గణేష్, యగ్గడి శ్రీరామ్ మూర్తి,బత్తుల నందకుమార్
హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, ఈ నిధుల కేటాయింపు విశేష కృషి చేసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా కటకం గణేష్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాన గౌరవం కల్పిస్తుందని, అన్ని వర్గాలకు సమాన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని,అందులో భాగంగానే కులవృత్తులను ప్రోత్సహించడం,అలాగే వారి ఆత్మగౌరవం భవనాలను నిర్మించడం ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు తగిన గౌరవం కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో బీసీలు అందరూ టీఆర్ఎస్ కు అండగా నిలుస్తారని,సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని బీసీ వర్గ ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.