బెల్ట్‌షాపులు ఎత్తేయండి కార్యాచరణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌,మే 8 (జనంసాక్షి) :
రాష్ట్రవ్యాప్తంగా మద్యంరూపంలో నేరాలుపెరిగిపోతున్నాయని ప్రభుత్వానికి అధికారులు, పోలీసుల నుంచి సమగ్ర సమాచారం ఉన్నప్పటికి అదనంగాఆదాయం వస్తుందన్న ఉద్దేశ్యంతో చూసీ చూడట్లుగా వ్యవహ రించారు. అయితే రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యం సేవించి నేరాలకు పాల్పడుతున్నట్లు మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం ప్రధానంగా ముక్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం  సమావేశం నిర్వహించారు. సమగ్రంగా చర్చించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని   ెల్టుషాపులున్నా కూడా తక్షణమే మూసివేయించేందుకు కార్యరంగంలోకి దూకాలని ముఖ్యమంత్రి ఎక్సయిజ్‌ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోపు ఎన్ని మూయించారో లెక్కలు చూపించాలని కూడా సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో రోజురోజుకు     బమహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులన్నీ కూడామద్యం సేవించడం వల్లే జరుగుతున్నాయని వాస్తవాలు చెపుతున్నాయి. అయితే బెల్టు షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయనే విషయం ఎక్సయిజ్‌శాఖ వద్ద లేవని మంత్రులు పేర్కొనడం నిజంగా శోచనీయం. పిల్లి తనను ఎవరూ చూడడంలేదని పాలు త్రాగుతున్నట్లుగా, ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించడం శోచనీయం. గ్రామాల్లో ఊరుకు ఒకటి రెండు బెల్టు షాపులున్నాయనేది జగమెరిగిన సత్యం. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను అదుపుచేసేందుకు చర్యలుతీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతూనే ఉన్నారు. ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నందున రాష్టాల్ల్రో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయ ని పోలీసులు పేర్కొంటున్నారు. మంత్రి మాత్రం ఆదాయం కంటే మహిళల రక్షణెళి ముఖ్యం కాబట్టే బెల్ట్‌ షాపులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ముఖ్య మంత్రిగత పదిరోజుల క్రితం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో బెల్టుషాపులు ఎత్తివేస్తామని హామి కూడాఇచ్చారు. త్వరలో గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నందున కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌ రావా లంటే బెల్టుషాపులు మూసివేయక తప్పదని అంతర్గతంగా మథనం జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు సమావేశం జరుపుతూ బెల్టుషాపుల మూసి వేతపై గత వారం రోజులుగా ఎక్సర్‌ సైజ్‌ చేసినట్లు పరిస్థితులు కనిపించాయి. మద్యం షాపులు మాత్రం రాత్రి 10.30గంటలవరకు మాత్రమే నడి పించేవారని, బెల్టు షాపులు 24గంటలు నడిపించడం వల్ల గ్రామాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నా యని పోలీసులు సమగ్రంగా ప్రభుత్వానికి నెత్తీ నోరు బాదుకుంటూ చెప్పినా పట్టించుకున్న పాపాన పోలే దని చెప్పవచ్చు. ఏదిఏమైనా ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లో, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తెలి యక పోయినా బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈవిషయంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలుతగ్గుతాయన్నారు. అతిపెద్దనిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రిగి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ సెక్రటేరియట్‌లో మాట్లాడుతూ గ్రామాలకు వెల్లినప్పుడల్లా తమకు పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు వచ్చేవని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగా  నిర్ణయం తీసుకోవడం హర్ష దాయకమన్నారు.