బైక్-లారీ ఢీ: ఇద్దరు మృతి
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని డోర్నకల్ మండలం గొర్లచర్ల గ్రామం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.