బొగ్గు బ్లాక్‌లు దక్కకపోవడంతో సింగరేణికి ఇబ్బందులు
` సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోంది
` ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది
` కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలి
` గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి ప్రవేశించింది.: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోందని ఆయన వివరించారు. ఆ సంస్థ సీఎండీ ఎన్. బలరాంతో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్?మీట్?లో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాకులు దక్కడం లేదని ఆవేదన చెందారు. సంస్థ కేవలం ఉపాధికే పరిమితం కాకుండా స్థానికులకు ఒక నమ్మకం కలిగిస్తోందని డిప్యూటీ సీఎం వివరించారు.కీలక ఖనిజాల వెలికితీతలో అవకాశం కల్పించాలి : కొత్త బ్లాకులను కేటాయించకపోవడం వల్ల సింగరేణి సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కర్ణాటకలో రాగి, బంగారం గనుల తవ్వకాల వేలంలో, రాయచూర్, దేవదుర్గ్ బెల్ట్‌లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో సింగరేణి పాల్గొన్నదని ఆయన వెల్లడిరచారు. రాగి, బంగారం మైనింగ్‌ను ఏ సంస్థ చేసినా సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించిందన్నారు. కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని కోరారు. కీలక ఖనిజాల తవ్వకాల కోసం సింగరేణి గ్లోబల్ అనే పేరుతో వెళ్తుందని స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న బొగ్గు గనుల వేలంలో కొన్నాళ్లుగా సింగరేణి పాల్గొనటం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఎందుకు పాల్గొనటం లేదో తాము పరిశీలించామని, వేలం ద్వారా పొందే రాయల్టీ ఆ రాష్ట్రాలకే చెందుతుందన్నారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు బ్లాక్‌లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్తాయన్నారు. కొత్త బ్లాక్‌లు రాకుంటే సింగరేణి మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. సింగరేణికి కొత్త బ్లాక్‌లు రాకపోవడంతో ఆ సంస్థతో పాటు రాష్ట్రానికి నష్టమని వివరించారు.దేశంలో కొత్తగా 109 బొగ్గు గనులను ప్రభుత్వరంగ సంస్థలు దక్కించుకున్నాయన్న ఆయన, ఇతర రాష్ట్రాల్లోని సంస్థలు కొత్త గనులు దక్కించుకుంటే రాష్ట్రంలో ఉన్నవే మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణి సంస్థ కొత్త గనుల వేలంలో పాల్గొనకుండా ఎందుకు చేశారో తెలియదన్నారు. ఇకపై గనులకు ఎక్కడ వేలం జరిగినా సింగరేణి సంస్థ పాల్గొంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
సింగరేణిని బతికించుకోవాలి
సింగరేణిని బతికించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఏమి ఇవ్వలేం.. సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో కార్మిక సంఘాలు ఆలోచించి మార్గం కనిపెట్టండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. సింగరేణి సంస్థలో పనిచేసే వారు సంస్థ గురించి విధానపారమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ తక్కువ ధరకు బొగ్గు లభిస్తే అక్కడ కొనుక్కునే అవకాశం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు అమ్మకం కాకపోతే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అన్ని సంఘాలు సమావేశమై సింగరేణి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని అమలు చేసేందుకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి సంస్థను బతికించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలని కార్మిక సంఘాలకు సూచించారు. కార్మిక సంఘాలు అవగాహన లేకుండా హిస్టారికను మాట్లాడితే సంస్థకు నష్టం జరుగుతుంది. మారిన ఆర్థిక పరిస్థితులు, ఓపెన్ మార్కెట్లో బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి పోటీలో నిలబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను సింగరేణి అధికారులు కార్మికులకు భోజనం పెట్టి వివరించాలని, ఆఫ్ డే లీవ్ ఇచ్చి మరి విషయాలను వివరించాలని సింగరేణి అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. సమావేశంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక ప్రసాద్, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.