బొత్సా.. పిస్సపిస్సగా వాగొద్దు

వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మేలో మహోద్యమం
బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలి : కేసీఆర్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
బొత్సా.. తెలంగాణపై పిస్సపిస్సగా మాట్లాడొద్దని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు హెచ్చరించారు. బయ్యారంలోని ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని, లభ్యత తక్కువ ఉందని మట్లాడటంపై ఆయన మండిపడ్డారు. తాము చేస్తున్న ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూస్తూ ఊరుకోబోమన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని వనరులను ఎత్తుకెల్లిపో తున్నట్లుగానే నేడు ఇనుప ఖనిజాన్ని సైతం ఆంధ్రాకు తరలించుకు పోయేందుకు కుట్ర జరుగుతోందని, ఈ ఆటలను సాగనివ్వబోమని కేసీఆర్‌ హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు రేఖానాయక్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసిఆర్‌ వారందరికీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసం దర్భంగా రేఖానాయక్‌ను ఖానాపూర్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఖానాపూర్‌ లో టిఆర్‌ఎస్‌ పాగా వేస్తుందని రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతుందన్నారు. సీమాంధ్ర పాలకులు ఎవరున్నా కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే వస్తున్నారని ఆరోపించారు. నాణ్యమైన  మిగతా 2లోఇనుప ఖనిజం కాదని కొత్త కబుర్లు చెప్పడం మాని తమ సంపదను తమకే వదిలేస్తే తమ బతుకులేవో తామే బతుకుతామన్నారు. ఏమాత్రం తెలంగాణపై ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మే నెలలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణ సంపదపై నీచమైన వ్యాఖ్యలుచేసిన బొత్స తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వైజాగ్‌ స్టీల్‌ కర్మాగారానికి కేటాయింపులపై జారీచేసిన ఉత్తర్వులు రద్దుచేయాలని కేసిఆర్‌ డిమాండ్‌ చేశారు. సీమాంధ్రుల పాలనలో ఉన్నంతకాలం తెలంగాణాలో అభివృద్ధి కనిపించదన్నారు. రాజకీయశక్తిగా ఎదగాల్సినవసరం ఉందని, తెలంగాణలోని ప్రతిఒక్కరు ఒకవైపే రావాల్సినవసరం ఉందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అపారమైన వనరులు, సంపద ఉన్నాయని భగవంతుడు, ప్రకృతి అన్ని అందిస్తే మానవ రూపంలో ఉన్న సీమాంధ్ర రాక్షసులు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో 48శాతం అడవులు, 18శాతం రోడ్లు, చెరువులు పోగా 30శాతం వ్యవసాయ భూములున్నాయన్నారు. అడుగడుగునా వాగులు వంకలు పొంగి పొర్లుతూనే ఉంటాయని అయినా జిల్లా అట్టడుగునే పడిఉందన్నారు. సదర్‌మాట్‌ ప్రాజెక్టుకు వందేళ్ల చరిత్ర ఉందని ఇక్కడ ఆనకట్టను మరికొంత పెంచితే అదనంగా వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని, అలాగే పెన్‌గంగ నిర్మాణంతో తాంసి, భేల మండలాల్లో భూములు నీటి పాలుకాకుండా ఉంటాయన్నారు. మహారాష్ట్ర పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మిస్తుంటే  మన ప్రభుత్వం మాత్రం 12ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యం కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే ఈ ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని అన్ని వనరులను వినియోగించుకునేలా ప్రణాళికలుంటాయన్నారు. మణుగూర్‌లో ఉన్న బొగ్గుగనులను అక్రమంగా తరలిస్తూ విజయవాడలో విటిపిఎస్‌, ఆర్‌టిపిఎస్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. బొగ్గు, నీల్లున్నా కూడా మణుగూరులో ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చావు దగ్గరికి పోయి తెలంగాణ సాధిస్తే చంద్రబాబు రాత్రికి రాత్రి అడ్డుకున్న పాపాత్ముడన్నారు.