బోథ్ గులాబీలో ఆగని ఆధిపత్య పోరు
నిర్మల్, సెప్టెంబర్24 (జనంసాక్షి) : ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వ కారణం.. అడుగడుగునా ఆధిపత్య పోరు తప్ప. అధికార విపక్ష అనే తేడా లేకుండా ప్రతి పార్టీకి ఆధిపత్య పోరు బెడద తప్పట్లేదు. అందుకు అధికార టీఆర్‌ఎస్ మినహాయింపు కాదుజ. నిర్మల్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఆధిపత్యపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసన సభ ఎన్నికల్లో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గెలిచి రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఇంకా తేరుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆధిపత్య పోరు తెరవిూదకు వస్తూనే ఉంది.
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును పకడ్బందీగా లక్ష్యాన్ని మించి చేపట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం
ఆదేశించినప్పటికి నాయకులు, కార్యకర్తలు బేఖా తరు చేస్తున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు, మాజీ ఎంపీ గోడం నగేష్‌ల మధ్య దీర్ఘకాలం గా ఉన్న విబేధాలు అధిష్ఠానం ఎన్ని హెచ్చరికలు చేసినా సమసిపో లేదు. ఇరునేతల వైఖరి వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత ఆ ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. గత పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కోల్పోయేలా చేసింది. టీఆర్‌ఎస్‌కు కంచు కోట వంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను బోథ్ అసెంబ్లీ పరిధిలో ఘోర పరాజయం చవి చూసింది. అయినా పరిస్థితిలో మార్పురాలేదు.
మాజీ ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో ద్వితీయ శ్రేణి నాయ కులు విసిగిపోతున్నారు. కొందరు పార్టీకే గుడ్ బై చెబుతున్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో సైతం పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల ను కాదని నగేష్ వర్గీయులు కొన్ని ప్రాంతాల్లో రెబల్స్‌గా రంగంలోకి దిగారు. అధికార పార్టీ అభ్యర్థులపై విజయం సాధించి ఎమ్మెల్యే వర్గీయు లను ఖంగు తినిపించారు. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం కోసం ఎమ్మెల్యే బాపూరావు బోథ్ పరిధిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమా వేశానికి నగేష్ వర్గీయులు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో నగేష్ తన వర్గీయులను పిలిపించుకొని పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని తన వర్గీయు లకు నచ్చచెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఎమ్మెల్యే నుంచి పుస్తకాలను తీసుకుని సభ్యత్వ నమోదు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాల్సింది పోయి తిరిగి పార్టీ సభ్యత్వ న మోదు చేయించాలని నచ్చజెప్పడం ఏమిటని
ఎ మ్మెల్యేతో వాదించారు.
దీంతో ఎమ్మెల్యే బాపురావు వెంటనే నగేష్ వర్గీయులను పిలిపించి వారి నుంచి సభ్యత్వ నమోదు పుస్తకాలను వెనక్కు తీసుకు న్నట్లు సమాచారం. దీంతో నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల నుంచి సభ్యత్వ నమోదు పుస్తకా లను తెప్పించి పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అయినా వారు అంత ఉత్సాహంగా చేపట్టలేక పోయారు. ప్రధాన మంత్రి సడక్ యెజన క్రింద అనేక రోడ్లు మంజూరైనా ప్రారంభం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసి వదిలేశారు. .ఎమ్మెల్యే వర్గీయులు నగేష్ వర్గీయులను చేరదీయడంలో ససేమిరా అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ మండల, గ్రామ కమిటీల ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గీ యులకే పదవులు దక్కాయి. నగేష్ వర్గీ అవాక్కయి మౌనంగా ఉండిపోయారు.
ఆదిలాబాదు పార్లమెంటు నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన గోడం నగేష్‌కు రాష్ట్రస్థాయిలో ఏదో ఒకటి తప్పకుండా నామినేటెడ్ పదవి లభిస్తుందన్న ఆశ లో ఆయన వర్గీయులు ఉన్నారు. నగేష్‌కు నామినే టెడ్ పదవి లభించినట్లయితే మళ్లీ ఆయన వర్గం బలపడుతుందని కొందరు, నగేష్‌కు నామినేటెడ్ పదవి దక్కనట్లయితే పార్టీ ఫిరాయించడానికి కూ డా మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కిందిస్థాయి నాయకుల్లో కొందరు మార్కెట్ చైర్మెన్, వైస్ చైర్మెన్, ఇతర జిల్లా, రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా రు. రాజధానిలో మకాం వేసి పైరవీలు జరుపు తున్నారు. ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి మార్కెట్ పదవుల కోసం పార్టీలో పోటీ తీవ్రమైంది. కొందరు నాయకులు, కార్యకర్తలు ఎమ్మల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య విబేధాలతో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న గులాబీ శ్రేణులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.