బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యనం చేయాలి

మెదక్‌, జనవరి 28 (): బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యవంతులను చేసే ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నుండి ఐ.టి.ఐ. వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సి. రంగారెడ్డి, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పద్మ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ నాగయ్య, ఎన్‌.ఆర్‌.హెచ్‌.ఎం. డి.పి.ఓ డాక్టర్‌ జగన్నాథ్‌రెడ్డి, డెమో వంసతరావు తదితరులు ఉన్నారు.