బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ చేసిన ఎంపీపీ లకావత్ మానస

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) హుస్నాబాద్ మండలంలోనీ మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా గ్రామాలలో గురువారం హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస-సుభాస్ ఆధ్వర్యంలో బోదకాలు నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.అనంతరం బోదకాలు నివారణ మందులు డైయిథైల్ కార్బమజైన్ (డి.ఇ.సి.) ఆల్బెండు జోల్ మందులను స్వయంగా వారు కూడా తీసుకున్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తరాల లతా మహేందర్, లావుడ్యా స్వరూప,ఇస్లావత్ రజిత రాజేంధర్,డా సౌమ్య , వైద్య సిబ్బంది,ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు,ఆశ కార్యకర్తలు,ఏఎన్ ఎం, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.